AP: ‘సీఎం చంద్రబాబుది గుడ్డి విజనరీ పాలన’ అని వైసీపీ ఎద్దేవా చేసింది. బుడమేరుకు వరదలు వస్తాయని, తిరుపతిలో తొక్కిసలాట జరుగుతుందని ముందే తెలిసినా పట్టించుకోలేదని మండిపడింది. ‘ఎన్ని వేలమంది భక్తులు వచ్చినా శ్రీవారి దర్శనం సాఫీగా సాగుతుందని, అలాంటి చోటనే టోకెన్లు ఇవ్వలేక, నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగేలా చేసి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. ఈ కూటమి చవటలు మున్ముందు రాష్ట్రాన్ని ఇంకెటు తీసుకెళ్తారో’ అని ఆరోపించింది.