భోలే బాబా పరార్

51చూసినవారు
భోలే బాబా పరార్
యూపీలోని హాత్రాస్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన వారిపై భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టంలోని 105, 110, 126(2), 223, 238 సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య సేవ‌దార్‌గా ఉన్న దేవ్‌ప్ర‌కాశ్ మ‌ధుక‌ర్‌పై కేసు బుక్ చేశారు.