బీజేపీపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు.
బీజేపీ ఒక విష సర్పమని, ప్రజలు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. జీ20 సమావేశం సందర్భంగా పేదల మురికివాడలను కనపడకుండా దాచేసిన ప్రధాని
మోదీ తానెంతో అభివృద్ధిని సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని విపక్ష ఏఐడీఎంకే ఒక పనికిరాని పార్టీ అని, తమిళనాడులో తలదాచుకునేందుకు బీజీపీకి అది చోటిస్తోందని విమర్శించారు.