దేశంలో కొన్ని రోజులుగా పలు విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దుండగులు ఈసారి రైళ్లపై పడ్డారు. దర్భంగా నుంచి ఢిల్లీకి వెళ్తున్న 12565 బిహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు చేశారు. దీంతో గోండా రైల్వే స్టేషన్లో రైలును ఆపి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్ని కోచ్లు, ఇంజిన్, గార్డు కంపార్ట్మెంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థం లభ్యం కాలేదు.