Top 10 viral news 🔥
AP: లక్కీ భాస్కర్ సినిమా చూసి నలుగురు విద్యార్థులు మిస్సింగ్
AP: లక్కీ భాస్కర్ సినిమా చూసి నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారయ్యారు. విశాఖ మహారాణిపేటలోని అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి సోమవారం వీరు పరారైనట్లు హోమ్ ఇన్చార్జ్ వేళంగిరి తెలిపారు. 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ్, రఘులు లక్కీ భాస్కర్ సినిమా చూసి హీరోలాగే డబ్బు సంపాదిస్తామంటూ హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఇళ్లు, కార్లు కొన్నాకే తిరిగి వస్తామని స్నేహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.