యూకేలోని జైళ్లలో ఉన్న నేరస్థులకు తమ 'సమాజ సేవ' శిక్షలను వర్క్‌ఫ్రమ్ హోమ్ ద్వారా పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. ఈ రకంగా వివిధ కోర్టులు విధించిన 5,40,000 గంటల 'సమాజ సేవ' శిక్షలను వెబ్ పేజీలను క్లిక్ చేసి నేరస్థులు పూర్తి చేసుకొన్నట్లు పేర్కొంది. దొంగతనాలు, షాప్ లిఫ్టింగ్‌లు, దాడులు, నేరపూరిత నష్టాలు వంటి వాటికి సమాజసేవను శిక్షగా విధిస్తారు.