మంచు ఫ్యామిలీలో వివాదం.. ఫాంహౌస్ నుంచి వీడియో లీక్

55చూసినవారు
మంచు కుటుంబంలో వివాదం నేపథ్యంలో జల్ పల్లి ఫాంహౌస్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాకు లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేయడం కనిపిస్తోంది. ఇదంతా మోహన్ బాబు ముందే జరగడం గమనార్హం. మోహన్ బాబు ఫాంహౌస్లో ఆరు బయట కుర్చీలో కూర్చుని ఉండగా ఓ బౌన్సర్ ఇద్దరు యువకుల చెంపపై కొడుతూ వారి సెల్ ఫోన్లు లాక్కున్నాడు. ఈ వీడియోను ఎవరు తీశారనే విషయం మాత్రం తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్