వృద్ధురాలి పై నుంచి వెళ్లిన బస్సు (వీడియో)

546చూసినవారు
కర్ణాటకలోని బెళగావిలో సోమవారం విషాద ఘటన జరిగింది. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఓ వృద్ధురాలు రోడ్డు దాటేందుకు యత్నించింది. అదే సమయంలో సిగ్నల్ పడడంతో వాహనాలు ముందుకు కదిలాయి. ఆ సమయంలో వృద్ధురాలిని రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సు ఢీకొట్టింది. ఆమెపై నుంచి బస్సు దూసుకెళ్లింది. బస్సు చక్రాల కింద నలిగి ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్