కరిచిందని కుక్క కళ్లు పొడిచేశాడు

576చూసినవారు
కరిచిందని కుక్క కళ్లు పొడిచేశాడు
తనను కరిచిందనే కోపంతో ఓ కుక్కను దారుణంగా హింసించాడో సైకో. హిమాచల్‌ప్రదేశ్‌లోని నగ్రోత బగ్వాన్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. వైదేహి అనే పేరు గల కుక్క స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తిని కరిచింది. దీంతో కుక్కను ఓ గదిలో కట్టేసి గత కొన్ని రోజులుగా చిత్రహింసలు పెడుతున్నాడు. దాని కళ్లు సైతం పొడిచేశాడు. స్థానికుల సమాచారంలో పోలీసులు అక్కడికి చేరుకుని కుక్కను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :