
డ్రైవింగ్ టెస్ట్‌లో వీటిని జోడించండి: హర్ష గోయెంకా సైటర్
దేశంలోని రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితిపై వ్యాపారవేత్త హర్ష గోయెంకా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ' ఆర్టీవో అధికారులారా.. ఇండియన్ రోడ్లపై డ్రైవింగ్ చేయాలంటే టెస్టులో వీటిని కూడా చేర్చండి. ట్రాక్‌పై గుంతలు, రాంగ్ రూట్లో ట్రక్కు రావడం, ఒకేసారి అంకుల్స్ రోడ్డు దాటడం, రోడ్డు మధ్యలో ఆవులను ఉంచడం, ఛేజ్ చేసేందుకు ఓ కుక్కను పెడితే నిజమైన టెస్ట్ అవుతుంది' అని రాసుకొచ్చాడు.