తమిళ చిత్ర దర్శకుడు జి.మోహన్ ఇటీవల ఓ వీడియోలో పంచామృతంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వీడియోలో ఆయన ‘పళని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదవడంతో చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను తిరుచ్చికి తరలించారు. పజయ వన్నారపట్టైతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన మోహన్.. తాండవం, రుద్రతాండవం, ద్రౌపతి వంటి సినిమాలు తీశారు.