బండరాళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్న కార్లు (వీడియో)

270354చూసినవారు
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అయితే, సోమవారం అదృష్టవశాత్తు కొన్ని కార్లు కొండ చరియల బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. కొద్దిసేపైతే అవి బండరాళ్ల కింద నలిగిపోయేవి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది నిజంగా షాకింగ్ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.