అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద బుధవారం రాత్రి తాను విధులు నిర్వహించకుండా అడ్డుకున్నాడని ఎస్సై రమేశ్ మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అలాగే పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.