జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను పునరుద్ధరించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో అక్కడ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశించడంతో రంగంలోకి దిగిన మార్షల్స్ ఓ ఎమ్మెల్యేను బయటకు పంపించివేశారు. గురువారం కూడా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.