చెన్నై భారీ స్కోర్.. గుజరాత్ టార్గెట్ ఇదే!

1049చూసినవారు
చెన్నై భారీ స్కోర్.. గుజరాత్ టార్గెట్ ఇదే!
సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో CSK నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె 51(23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. గైక్వాడ్ 46, రచిన్ 46, మిచ్చెల్ 24, రహానే 12 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. గుజరాత్ టార్గెట్ 207 పరుగులు.