తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మెదక్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 15.7, పటాన్‌చెరులో 16.2, దుండిగల్‌లో 18, నిజామాబాద్‌లో 18.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.