AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. 'నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది' అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.