మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఎదుటే కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫయాజ్ ఒంటెద్దు పోకడలను ఎమ్మెల్యే వివేక్ కు కార్యకర్తలు వివరించారు. దీంతో ఎమ్మెల్యే ఎదుటే కార్యకర్తలను బూతులు తిట్టాడు ఫయాజ్, అతని అనుచరులు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలుకావడంతో పోలీసులు సముదాయించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే వివేక్ అసహనంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు.