దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్ దర్శనమిచ్చింది. అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. లలాండౌర్- ధంధేరా స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం 6:35 గంటలకు ఈ ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న అధికారులు సిలిండర్‌ను పరిశీలించగా అది ఖాళీది అని తేలింది.