2001తో పోలిస్తే 2030లో వేడి మూడొంతులు.. కరువు 30శాతం పెరిగి జనాలు అల్లాడిపోతారని యూఎన్ రిపోర్ట్ హెచ్చరించింది. విపత్తులంటే కేవలం ప్రకృతి విపత్తులు మాత్రమే కాదని.. కొవిడ్-19 లాంటి ముప్పులు.. ఆర్థిక సంక్షోభాలు, ఆహార కొరత లాంటివన్నీ.. పర్యావరణ మార్పులతోనే సంభవిస్తాయంటోంది. విపత్తులు వచ్చినప్పుడు అత్యధికంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతాల ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూఎన్ నివేదికలో స్పష్టం చేసింది.