ఏ దేశమైనా.. ఎక్కడి జనమైనా ఒకటే. దాహం వేసినప్పుడు బావి తవ్వే టైపే అందరూ. విపత్తులు రాకుండా ఎలా అడ్డుకోవాలో, ఒకవేళ వస్తే ఎలా ఎదుర్కోవాలో.. ఎవరి దగ్గరా ప్లానింగ్ ఉండదు. అందుకే జరగరానివి జరిగితే కకావికలమవుతున్నారు. అప్పటికప్పుడు రిలీఫ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో విపత్తుకు ప్రపంచం ఏడాదికి రూ.13 లక్షల కోట్ల ఖర్చు పెడుతోంది. అందులో 90శాతం ఖర్చు విపత్తు వచ్చాకే జరుగుతోంది. ఇప్పటికైనా మనం మారాలి.