మనిషి హద్దు మీరితే ప్రకృతి శిక్షిస్తుంది. 100 ఏళ్లుగా మనం ఈ మాటలు వింటూనే ఉన్నాం. అయినా ఏమాత్రం మారటంలేదు. పర్యావరనానికి హాని చేయటం మానటంలేదు. మనషి తన పద్ధతులు మార్చుకోకుండా ప్రకృతి విలయతాండవం చవిచూడాల్సి వస్తోంది. మాడు పగిలే ఎండలు.. ఊళ్లను ఊడ్చేసే వరదలు.. వణికించే చలిగాలులు.. జనం అల్లాడిపోయే కరువు పరిస్థితులు.. నిప్పులు చిమ్మే అగ్ని పర్వతాలు.. కాలి బూడిదయ్యే అడవులు.. మనుషుల్ని మింగేసే వైరస్‌లు.. ప్రాణాలు తీసే రసాయన ప్రమాదాలు.. ఇవన్నీ ప్రకృతి ప్రకోపానికి సంకేతం.