రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. నటుడిపై కేసు నమోదు

50చూసినవారు
రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. నటుడిపై కేసు నమోదు
రాహుల్ గాంధీపై వివాదాస్పదమైన పోస్టు పెట్టినందుకు.. ఒడిశా నటుడు బుద్దాదిత్య మొహంతిపై నేషనల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుద్ధాదిత్య తన సోషల్ మీడియా పోస్టులో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను చంపిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తదుపరి లక్ష్యం రాహుల్ గాంధీ అని పేర్కొన్నాడు. ఈ మేరకు కాంగ్రెస్ విద్యార్థి నేతలు బుద్దాదిత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.