చార్‌ధామ్ ఆలయాల మూత
By Shivakrishna 58చూసినవారుహిమాలయాల్లోని గఢ్‌వాల్ పర్వతశ్రేణుల్లోని చార్‌ధామ్ ఆలయాలు శీతాకాలం కారణంగా వరుసగా మూతపడుతున్నాయి. గంగొత్రి మందిర ద్వారాలను శనివారం మూసివేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. చార్‌ధామ్ సమూహంలోని యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలు ఇవాళ మూతపడనున్నాయి. బద్రీనాథ్ మందిరాన్ని ఈనెల 17న మూసేస్తారు. ఏప్రిల్-మే నెలల్లో ఈ ఆలయాలు మళ్లీ తెరుచుకుంటాయి.