విద్యార్థిని ప్రాణాలు బలిగొన్న ‘స్పీడ్ బ్రేకర్’
AP: విశాఖ జిల్లా ఆనందపురంలో విషాదం చోటు చేసుకుంది. గొల్లలపాలేనికి చెందిన కోండ్రు భరణి (17) తగరపువలసలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. ఎప్పటిలాగే శనివారం కాలేజీ బస్సులో వెళ్తుండగా.. ఏనుగులపాలెం వద్ద స్పీడ్ బ్రేక్ వద్ద డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఫుట్‌పాత్‌పై ఉన్న భరణి అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. భరణి మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.