దేశంలో తొలిసారిగా రూ.36 వేల కోట్లు విలువైన 6000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్‌కు చెందిన విజయపురంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను మంటల్లో కాల్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరగోపిందర్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, స్థానిక అధికారులు మద్దతుతో వీటిని నాశనం చేశామన్నారు. ఇంటర్నల్ ఫైర్ ద్వారా ధ్వంసం చేయడం వల్ల కాలుష్యం తక్కువని చెప్పారు.