AP: ’రాష్ట్రంలో సంక్రాంతి సందడి కానరావడం లేదు‘ అని వైసీపీ ట్విట్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ‘ప్రజల చేతుల్లో కాణీ లేకపోవడంతో ఎక్కడా కొనుగోళ్లు లేవు. దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు ఆడడం లేదు. దీంతో పండగ షాపింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న ఉండి ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని, దాంతో పండగ గడిచిపోయేదని..ఇప్పుడు పండగ చప్పగా ఉంటుందని ప్రజలు అంటున్నారు’ అని పేర్కొంది.