తీరం దాటుతున్న ‘ఫెంగల్‌’ తుఫాను

80చూసినవారు
తీరం దాటుతున్న ‘ఫెంగల్‌’ తుఫాను
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును వణికిస్తున్న ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ప్రక్రియకు దాదాపు 4 గంటలు పట్టొచ్చని ఐఎండీ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.