పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

59చూసినవారు
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. గోవిందరావుపేట మండలం చల్వాయి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బస్సు రన్నింగ్‌లో ఉన్నప్పుడు స్టీరింగ్ సమస్య తలెత్తిందని, దాంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్