హైదరాబాద్లోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శ్రావ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆమె కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మలక్పేట పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో మలక్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.