భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫుల్ బిజీగా గడిపిన ధోనీ ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. తాజాగా ధోనీ తన భార్య సాక్షి, ముద్దుల కూతురు జీవాతో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు. ప్రస్తుతం వీరు పారిస్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట తెగ ఆటకట్టుకుంటున్నాయి.