పొగాకుతో మధుమేహం!

53చూసినవారు
పొగాకుతో మధుమేహం!
టైప్ 2 మధుమేహాన్ని బద్ధకం వంటి వాటితో ముడిపడిందనే భావిస్తుంటాం. పొగాకూ దీనికి దోహదం చేస్తున్నట్లు తాజాగా బయటపడింది. తల్లి కడుపులో ఉండగా పొగాకు ప్రభావానికి గురైనవారికి బాల్యంలో లేదా యుక్తవయసులో సిగరెట్లు తాగటం మొదలెట్టిన వారికి పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశమున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సిగరెట్లు తాగేవారికి మధుమేహం ముప్పు 30-40% ఎక్కువని తేలింది.