బీహార్ శాసన మండలిలో శుక్రవారం బాలికా విద్యపై చర్చ జరిగింది. తన బెగుసరాయ్ జిల్లాలో బాలికల కోసం తగినన్ని స్కూల్స్ లేవని ఆర్జేడీ ఎమ్మెల్సీ ఊర్మిళా ఠాకూర్ తెలిపారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ‘బాలికల విద్య కోసం మేం ఏం చేశామో మీకు తెలుసా? మేం అధికారంలోకి వచ్చే వరకు బీహార్‌లో గ్రామీణ బాలికలు చాలా అరుదుగా స్కూల్స్‌కు వెళ్లేవారు’ అని అన్నారు.