ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇవ్వకపోయినా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం రిజర్వాయర్లు, కాల్వల నుంచి నీటిని సరఫరా చేస్తున్నాయి. పలు అంటు వ్యాధులకు, కిడ్నీ రోగాలకు, క్యాన్సర్లకు నీటి కాలుష్యం కూడా ఒక కారణం. రక్షిత తాగునీటిని ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తే ప్రజల ఆరోగ్యానికి అదే పెద్ద ఉపకారం. పర్యావరణ కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను, భూతాపాన్ని కొంతైనా తగ్గించేందుకు పరిష్కారం అదే.