కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి ఉన్న చోట ఐస్ క్యూబ్‌లను పెట్టడం వల్ల కాస్త రిలీఫ్ కలుగుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా యోగ, ప్రాణాయామం చేస్తే మంచిది. గోరువెచ్చని కొబ్బరి నూనెతో నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మైగ్రేన్ సమస్య తగ్గేందుకు ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చీకటి, నిశ్శబ్ద గదిలో విశ్రాంతి తీసుకోవాలి.