శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అంటారు. శివాలయంలో ఉండే ధ్వజ స్తంభం( నందీశ్వరుడు) దగ్గర నుంచి ఎడమ పక్కగా గర్భాలయం వెనక ఉన్న సోమసూత్రం(శివుని అభిషేకజలం బయటకు పోయే మార్గం) వరకు వెళ్ళి వెనక్కి తిరగాలి. కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు. మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలు పెట్టాలి.