TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. బెంగళూరు నుంచి నలుగురు యువకులు డ్రగ్స్ తీసుకొచ్చి.. ఎల్‌బీనగర్‌లోని మారుతీ లాడ్జ్‌లో విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల దగ్గర నుంచి MMDS డ్రగ్స్, కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.