అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7.53 గంటల ప్రాంతంలో
భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో
భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే.