జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున వంట గదికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకు రాకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆస్తి లావాదేవీలకు సైతం దూరంగా ఉండాలి. డబ్బులు ఇచ్చిపుచ్చుకోకూడదు. ఇక శుక్రవారం స్వీట్లు పంచకూడదు. పూజగదిని శుభ్రంగా ఉంచాలి. చిరిగిన దుస్తులు వేసుకోకూడదు.