అమెరికా లాస్ ఏంజిలిస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. కార్చిచ్చు కారణంగా దాదాపు 60 బిలియన్ల (సుమారు రూ.5 లక్షల కోట్లు) ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. లక్షమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండటంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదాపడ్డాయి. ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇటలీ పర్యటనను రద్దు చేసుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.