హైదరాబాద్‌లో నిత్యం వేల మందిని గమ్యస్థానాలకు చేర్చడంలో మెట్రో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో తాజాగా కీలక ప్రకటన చేసింది. మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. 'MeTimeOnMy Metro' పేరుతో జరిగిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడుతూ 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు.