ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల కళ్లముందే ప్రధానోపాధ్యాయురాలిపై టీచర్ శైలేష్ యాదవ్ తుఫాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ప్రధానోపాధ్యాయురాలిని ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.