AP: కానిస్టేబుల్ శ్రీనివాసరావు మానవత్వం చాటుకున్నారు. విజయవాడ- గన్నవరం రోడ్డులో నిలిపి ఉన్న లారీ క్యాబిన్లో డ్రైవర్ కుమార్ గుండెపోటుకు గురై విలవిలలాడిపోతున్నాడు. అయితే చాలా సేపటిగా లారీ అక్కడే ఉంచడంతో కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెళ్లి చూడగా కుమార్ గుండెపోటుతో క్యాబిన్లో కుప్పకూలిపోయి ఉన్నాడు. వెంటనే అతన్ని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.