జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పిలుపుతో పాక్ అట్టుడుకుతోంది. ఇస్లామాబాద్ కు బయలుదేరిన వేలాది మంది PTI కార్యకర్తలను అడ్డుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగడంతో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఖాన్ భార్య బుష్రా నేతృత్వంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని, రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్నారు.