ఆమ్ ఆద్మీ పార్టీకి మాజీ మంత్రి కైలాష్ గేహ్లాట్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బీజేపీ చేరారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్ సమక్షంలో కషాయ కండువా కప్పుకున్నారు. ఇదే సందర్భంగా కైలాష్కు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు.