దేవరకద్ర: కురుమూర్తి జాతరకు భారీగా భక్త జన సంద్రోహం

66చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని శ్రీకురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలు 15 రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు జాతరకు పోటెత్తారు. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి, ఉద్దాలతో ఆశీర్వాదం పొంది, కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. కురుమూర్తి ప్రాంగణం జనసంద్రోహం అయింది.

సంబంధిత పోస్ట్