నిరుపేద రోగులకు సీ. ఎం సహాయనిధి ఒక వరంగా మారిందని కల్వకుర్తి శాసనసభ్యులు గురక జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి, వెల్డండ మండలలాకు సంబంధించిన 19 చెక్కులను ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం భారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి సీ. ఎం సహాయనిధి రూపంలో ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ గౌడ్, కల్వకుర్తి మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఎముక జంగయ్య, కౌన్సిలర్లు సైదులు గౌడ్, శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు రుక్నుద్దీన్ తదితరులు ఉన్నారు.