ఆమనగల్లు: ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ మల్లురవి
నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లురవి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి పూల భోకె అందించి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి దామోదరం రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నారు.