పెబ్బేరులో హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

70చూసినవారు
పెబ్బేరులో హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
పెబ్బేరులో జాతీయ రహదారిపై గురువారం తెలంగాణ మోడల్ స్కూల్ దగ్గర ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెబ్బేరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు పెబ్బేరులోని ఓ ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :