వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నర్సింగాయపల్లి వద్ద గల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కలెక్టర్, రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.